నేడు కూడా కొనసాగిన పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' వర్క్ షాప్... ఫొటోలు ఇవిగో!

  • పవన్ హీరోగా 'హరిహర వీరమల్లు'
  • క్రిష్ దర్శకత్వంలో భారీ పీరియాడిక్ చిత్రం
  • త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభం
  • హైదరాబాదులో వర్క్ షాప్ ఏర్పాటు
  • హాజరైన పవన్, క్రిష్ తదితర టెక్నీషియన్లు
Photos from Pawan Kalyan Harihara Veeramallu workshop in Hyderabad

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న 'హరిహర వీరమల్లు' చిత్రం కొత్త షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ కు సంబంధించిన అంశాలపై ప్రస్తుతం హైదరాబాదులో వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. 

నిన్న సరస్వతి పంచమి సందర్భంగా ప్రారంభమైన ఈ వర్క్ షాప్ నేడు కూడా కొనసాగింది. పవన్ కల్యాణ్, దర్శకుడు క్రిష్, ఇతర టెక్నీషియన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త షెడ్యూల్ లోని ప్రతి సీన్ కు సంబంధించిన చర్చలు, రిహార్సల్స్ చేపట్టారు. 

'హరిహర వీరమల్లు' చిత్రంలోని పలు కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనుండడంతో, ముందస్తు సన్నద్ధత కోసం చిత్రబృందం వర్క్ షాప్ ఏర్పాటు చేసింది. ఈ వర్క్ షాప్ కు చెందిన ఫొటోలను చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్ సోషల్ మీడియాలో పంచుకుంది.

More Telugu News