టాలీవుడ్ చిత్రాలకు 60 శాతం మార్కెట్ ఏపీనే: విజయసాయిరెడ్డి

30-09-2022 Fri 20:44
  • ఏపీలో తెలుగు చిత్రాల ఈవెంట్లు
  • ఇటీవల కర్నూలులో 'ది ఘోస్ట్' వేడుక
  • అనంతపురంలో 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్
  • హీరోలు, నిర్మాతలు మరింత చొరవ తీసుకోవాలన్న విజయసాయి
Vijayasai Reddy appeal to Tollywood heroes and producers
ఇటీవల టాలీవుడ్ చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఏపీలో నిర్వహించడం ట్రెండ్ గా మారింది. కొన్నిరోజుల కిందటే చిరంజీవి 'గాడ్ ఫాదర్' చిత్రం ప్రీ రిలీజ్ వేడుక అనంతపురంలో ఘనంగా జరిగింది. నాగార్జున నటించిన ది ఘోస్ట్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏపీలోనే జరిగింది. దీనిపై విజయసాయిరెడ్డి స్పందించారు. 

యువ సామ్రాట్ నాగార్జున చిత్రం 'ది ఘోస్ట్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలులో నిర్వహించడం సంతోషదాయకం అని పేర్కొన్నారు. ఆ సినిమా యూనిట్ కు తన అభినందనలు తెలిపారు. టాలీవుడ్ చిత్రాలకు 60 శాతం మార్కెట్ ఏపీనే అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అందువల్ల హీరోలు, నిర్మాతలు చొరవ తీసుకుని సినిమా ఈవెంట్లు, షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏపీలో నిర్వహించాలని కోరారు.