Pawan Kalyan: జనసేన కార్యాలయంలో సరస్వతీదేవి పూజ చేసిన పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!

Pawan Kalyan performs Saraswathi Devi pooja at Janasena office in Hyderabad
  • దసరా నవరాత్రుల సందర్భంగా పూజా కార్యక్రమాలు
  • సంప్రదాయబద్ధంగా పూజలో పాల్గొన్న పవన్
  • వేదపండితుల ఆశీస్సులు
  • పూజ అనంతరం పార్టీ నేతలతో సమావేశం
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాదులోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో నేడు సరస్వతి దేవి పూజ నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన పవన్ కల్యాణ్ వేదపండితుల ఆశీస్సులు అందుకున్నారు. 

అనంతరం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలపై వారితో చర్చించారు. నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ పరంగా ఎలా ముందుకు పోవాలన్నదానిపై పలు సూచనలు చేశారు. 

కాగా, పవన్ సరస్వతి దేవి పూజ ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.
Pawan Kalyan
Saraswathi Devi Pooja
Janasena Office
Hyderabad

More Telugu News