బుమ్రా స్థానంలో మొహమ్మద్ సిరాజ్ కు చోటు.. మెడికల్ టీమ్ పర్యవేక్షణలో బుమ్రా
- వెన్ను గాయంతో జట్టుకు దూరమైన బుమ్రా
- దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ కు సిరాజ్ ఎంపిక
- సౌతాఫ్రికాతో ఆదివారం రెండో మ్యాచ్
ఇక బుమ్రా స్థానంలో హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాతో మిగిలిన రెండు టీ20లకు సిరాజ్ ను ఎంపిక చేసినట్టు ఒక ప్రకటనలో బీసీసీఐ తెలిపింది. బుమ్రా ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడని పేర్కొంది.
మరోవైపు 3 టీ20ల సిరీస్ లో టీమిండియా 1-0తో లీడ్ లో ఉంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో మ్యాచ్ ఆదివారం నాడు గువాహటిలో జరుగుతుంది.