'స్వాతిముత్యం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు!

  • యూత్ ఫుల్ కంటెంట్ తో 'స్వాతిముత్యం'
  • హీరోగా బెల్లంకొండ గణేశ్ పరిచయం 
  • అక్టోబర్ 2వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • 5వ తేదీన సినిమా విడుదల
Swathi Muthyam Movie Update

'స్వాతిముత్యం' సినిమాతో హీరోగా బెల్లంకొండ గణేశ్ పరిచయమవుతున్నాడు. సితార బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి లక్ష్మణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. గణేశ్ జోడీగా వర్ష బొల్లమ్మ అలరించనుంది. లవ్ ట్రాక్ తో యూత్ ను మెప్పిస్తూ .. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే పాయింట్ తో రూపొందిన సినిమా ఇది. 

ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మహతి స్వరసాగర్ సమకూర్చిన బాణీలు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ను ఖరారు చేశారు. 

అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగనుంది. మాదాపూర్ లోని శిల్పకళావేదికలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఆ రోజున సాయంత్రం  6 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుందని చెబుతూ అధికారిక పోస్టర్ ను వదిలారు. రావు రమేశ్ .. నరేశ్ .. ప్రగతి .. సురేఖా వాణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

More Telugu News