Prabhas: 12 ఏళ్ల తర్వాత సొంతూరుకి వచ్చిన ప్రభాస్.. పోటెత్తిన అభిమానులు

Prabhas went to Mogalthuru after 12 years to attend Krishnam Raju Samsmarana Sabha
  • మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ
  • లక్ష మంది అభిమానులకు పసందైన వంటకాలు సిద్ధం
  • భారీ భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు

రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ ఈరోజు ఆయన స్వగ్రామమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సభలో పాల్గొనేందుకు హీరో ప్రభాస్ మొగల్తూరుకు చేరుకున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత తన సొంతూరుకు ప్రభాస్ వచ్చారు. దీంతో ఆయనను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. మొగల్తూరులో సందడి వాతావరణం నెలకొంది. తన కుటుంబసభ్యులతో కలిసి అభిమానులకు ప్రభాస్ అభివాదం చేశారు. 

మరోవైపు, ఈ మధ్యాహ్నం అభిమానుల కోసం ప్రభాస్ టీమ్ పెద్ద ఎత్తున భోజన ఏర్పాట్లు చేసింది. దాదాపు లక్ష మంది అభిమానుల కోసం భోజన ఏర్పాట్లు చేశారు. కృష్ణంరాజు భోజనప్రియుడు అన్న సంగతి తెలిసిందే. దీంతో, ఆయనకు ఇష్టమైన వంటకాలతో భోజన ఏర్పాట్లు చేశారు. 25 రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలను సిద్ధం చేశారు. ముఖ్య అతిథులకు కృష్ణంరాజు ఇంటి ఆవరణలోనే ఏర్పాట్లు చేశారు. ఇతరులకు ఇంటికి దక్షిణం వైపు ఉన్న తోటలో ఏర్పాట్లు చేశారు. మరోవైపు భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల పోలీసులు ముందస్తుగానే భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 

  • Loading...

More Telugu News