Mahesh Babu: ఇందిరాదేవి పార్థివదేహం పద్మాలయా స్టూడియోస్ కు తరలింపు

Mahesh Babu mother Indira Devi mortal shifted to  Padmalaya Studios
  • తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూసిన ఇందిరాదేవి
  • మధ్యాహ్నం వరకు పద్మాలయా స్టూడియోస్ లో భౌతికకాయం
  • అనంతరం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, మహేశ్ బాబు అభిమానులు తరలివస్తున్నారు. మరోవైపు, కాసేపటి క్రితం ఆమె పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం పద్మాలయా స్టూడియోస్ కు తరలించారు. మధ్యాహ్నం వరకు ఆమె పార్థివదేహం అక్కడే ఉంటుంది. అనంతరం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహిస్తారు. 

ఇందిరాదేవి గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందారు. మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు కూడా ఈ ఏడాది జనవరిలో మృతి చెందారు. నెలల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులను కోల్పోవడంతో ఆ కుటుంబం బాధ వర్ణనాతీతంగా ఉంది.
Mahesh Babu
Mother
Mortal
Padmalaya Studios
Tollywood
Funerals
Indira Devi

More Telugu News