అందుకే పరశురామ్ ప్రాజెక్టు పట్టాలెక్కడం లేదట!
- 'గీత గోవిందం'తో పేరు తెచ్చుకున్న పరశురామ్
- బ్లాక్ బస్టర్ కి దూరంగా నిలిచిన 'సర్కారువారి పాట'
- తదుపరి సినిమా నాగచైతన్యతో
- స్క్రిప్ట్ పై జరుగుతున్న కసరత్తు
ఇంతా చేస్తే 'సర్కారువారి పాట'ను బ్లాక్ బస్టర్ హిట్ గా పరశురామ్ నిలబెట్టలేకపోయాడు. ఆ తరువాత చైతూ ప్రాజెక్టును చేసుకోవచ్చని అనుకుంటే, స్క్రిప్ట్ విషయంలో ఆయన మార్పులు .. చేర్పులు చెప్పాడట. దాంతో ప్రస్తుతం పరశురామ్ అందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. అందువల్లనే ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతోందని సమాచారం.
ఇక 'థ్యాంక్యూ' సినిమాతో ఫ్లాప్ మూటగట్టుకున్న చైతూ, ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ను నిర్ణయించని ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టి అలరించనుంది. 'బంగార్రాజు' హిట్ తరువాత ఈ జోడీ మళ్లీ తెరపై చేయనున్న సందడిపై అందరిలోను ఆసక్తి ఉంది.