టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు తల్లి కన్నుమూత

28-09-2022 Wed 07:47
  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి
  • ఇటీవలే మహేశ్‌బాబు సోదరుడు రమేశ్ బాబు మృతి
  • సంతాపం వ్యక్తం చేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
Tollywood Star Hero Mahesh Babu Mother Indira Devi Passed Away
టాలీవుడ్ ప్రముఖ నటుడు మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

కృష్ణ-ఇందిరాదేవికి రమేశ్‌బాబు, మహేశ్‌బాబుతోపాటు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. ఇప్పుడు ఇందిరాదేవి మృతితో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది.