రేపటి నుంచే దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ ప్రారంభం
- రేపు తిరువనంతపురంలో మొదలుకానున్న టీ20 సిరీస్
- అక్టోబర్ 4న ఇండోర్‌లో జరగనున్న మూడో టీ20తో ముగియనున్న సిరీస్
- ఇప్పటికే తిరువనంతపురం చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు
ఈ సిరీస్‌లో రెండో టీ20 మ్యాచ్ అక్టోబర్ 2న గువాహటిలో జరగనుంది. ఆ తర్వాత సిరీస్‌లో చివరి టీ20 మ్యాచ్ ఇండోర్‌లో అక్టోబర్ 4న జరగనుంది. ఇటీవలే ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టీ20 సిరీస్‌లో విక్టరీ సాధించిన టీమిండియా జట్టు దక్షిణాఫ్రికా జట్టుతో సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఈ సిరీస్ ప్రారంభ మ్యాచ్‌ను పురస్కరించుకుని తిరువనంతపురం స్టేడియం వద్ద టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చెందిన భారీ కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు.