NIA: పీఎఫ్ఐ సభ్యులను లక్ష్యంగా చేసుకుని మరోసారి దాడులు చేపట్టిన ఎన్ఐఏ

NIA raids again on PFI
  • దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో దాడులు
  • పలువురు పీఎఫ్ఐ నేతలు, కార్యకర్తల అరెస్ట్
  • 170కి పెరిగిన అరెస్టులు
  • కర్ణాటక, ఢిల్లీలో అత్యధిక అరెస్టులు
అతివాద చర్యలతో మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ, యువతను ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) శ్రేణులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరోసారి దాడులు చేపట్టింది. 

తాజాగా తెలంగాణ, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర,  అసోం రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో పీఎఫ్ఐ నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకుంది. 

కొన్నిరోజుల కిందట ఎన్ఐఏ అధికారులు 15 రాష్ట్రాల్లో దాడులు చేసి 106 మంది పీఎఫ్ఐ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. తాజా అరెస్టులతో కలిపి ఇప్పటివరకు అరెస్ట్ చేసిన పీఎఫ్ఐ సభ్యుల సంఖ్య 170కి పెరిగింది. ఒక్క కర్ణాటకలోనే 75 మందిని అరెస్ట్ చేశారు. ఢిల్లీలో 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.
NIA
PFI
Arrest
India

More Telugu News