వివో ఎక్స్ ఫోల్డ్ ప్లస్ విడుదల.. ధర వింటే షాక్

27-09-2022 Tue 12:59 | Technology
  • 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ ధర రూ.1,15,000
  • 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ ధర రూ.1,25,000
  • 8 అంగుళాల  పరిమాణంలో అమోలెడ్   డిస్ ప్లే
Vivo X Fold plus with Snapdragon 8 plus Gen 1 SoC faster charging tech launched
చైనా కంపెనీ వివో తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ‘వివో ఎక్స్ ఫోల్డ్ ప్లస్’ ను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఏడాది మొదట్లో స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్ సెట్ తో కూడిన వివో ఎక్స్ ఫోల్డ్ విడుదల కావడం తెలిసిందే. ప్రస్తుత ఎక్స్ ఫోల్డ్ ప్లస్ అన్నది దానికి అప్ గ్రేడెడ్ వెర్షన్. ఇందులోనూ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1 చిప్ సెట్ ఉంటుంది. 4,730 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. 

కాకపోతే దీని ధర ఐఫోన్ కంటే ఎక్కువగా ఉంది. ఎక్స్ ఫోల్డ్ ప్లస్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ ప్రారంభ ధర చైనాలో రూ.1,15,000. 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీ ధర రూ.1,25,000. ఫోన్ తెరిచినప్పుడు 8.3 అంగుళాల పెద్ద పరిమాణంతో కూడిన అమోలెడ్ డిస్ ప్లే, 2కే రిజల్యూషన్, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటుంది. ఫోన్ క్లోజ్ చేసినప్పుడు 6.53 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే కనిపిస్తుంది. ఈ ఫోన్ ను నోట్ బుక్ గానూ వాడుకునేందుకు వీలుంటుంది. దీని బరువు 311 గ్రాములు.