Delhi Air Hostess: తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని గదిలో బంధించి.. పోలీసులకు ఫోన్ చేసిన ఎయిర్ హోస్టెస్!

Air hostess locks man who reaped her and called police
  • ఢిల్లీలో 30 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ పై అత్యాచారం
  • నిందితుడు ఒక పార్టీకి చెందిన బ్లాక్ ప్రెసిడెంట్
  • ఇద్దరికీ నెలన్నర క్రితం పరిచయం
ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఒక ఎయిర్ హోస్టెస్ దారుణ మానభంగానికి గురైంది. తన ఇంట్లోనే ఆమెను హర్జీత్ యాదవ్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. నిందితుడు హర్జీత్ కాన్పూర్ ప్రాంతానికి చెందినవాడు. ఒక రాజకీయ పార్టీకి బ్లాక్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నాడు. 

అయితే అత్యాచారానికి గురైన తర్వాత కూడా ఆమె ఏ మాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా... ఆతన్ని గదిలో బంధించి పోలీసులకు ఫోన్ చేసింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు హర్జీత్ యాదవ్ ను అరెస్ట్ చేశారు. ఆయనపై సెక్షన్ 376 (అత్యాచారం), 323 (ఒక వ్యక్తిని హింసించడం), 509 (మహిళ గౌరవాన్ని నాశనం చేయడం), 377 (ప్రకృతి విరుద్ధమైన చర్యలకు పాల్పడటం) కింద కేసులు నమోదు చేశారు. 

ఈ సందర్భంగా డిప్యూటీ పోలీస్ కమిషనర్ చందన్ చౌదరి మాట్లాడుతూ 30 ఏళ్ల బాధితురాలు ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తున్నారని... హర్జీత్ యాదవ్ ఆమెకు నెలన్నర క్రితం పరిచయమయ్యాడని తెలిపారు. మద్యం మత్తులో బాధితురాలి ఇంటికి వచ్చి ఆమెపై అత్యాచారం చేశాడని చెప్పారు. అతన్ని గదిలో బంధించిన బాధితురాలు 112 నంబర్ కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు.
Delhi Air Hostess
Rape

More Telugu News