Junior NTR: ప్రశాంత్ నీల్ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా ఎన్టీఆర్?

  • ఎన్టీఆర్ 30వ సినిమాకి దర్శకుడిగా కొరటాల 
  • 31వ సినిమాను లైన్లో పెట్టిన ప్రశాంత్ నీల్ 
  • ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నాడంటూ టాక్
  • ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్
Ntr and Prashanth Neel movie update

ఎన్టీఆర్ తన 30వ సినిమాకి సంబంధించిన పనుల్లో ఉన్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాల్లో కొరటాల బిజీ. ఈ ప్రాజెక్టును ఎప్పుడు సెట్స్ పైకి తీసుకుని వెళ్లనున్నారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. విజయదశమికి లాంఛనంగా మొదలుపెట్టొచ్చనే టాక్ ఉంది. అయితే ఆ తరువాత ఎన్టీఆర్ చేయనున్న సినిమాకి సంబంధించిన టాక్ వినిపిస్తూ ఉండటం విశేషం.
 
తన 30వ సినిమాను ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన .. ఫస్టు పోస్టర్ కూడా బయటికి వచ్చాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ ఎలా ఉండనుందని విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. తాజాగా మరో వార్త హల్ చల్ చేస్తోంది.  ఈ సినిమాలో విలన్ గా ఎన్టీఆర్ చేయనున్నాడనేది ఆ వార్త సారాంశం. 

ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ హీరో మాత్రమే కాదు .. విలన్ కూడా అనే టాక్ బలంగా వినిపిస్తోంది. అంటే ఆయన ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్నాడన్న మాట. గతంలో 'జై లవ కుశ' సినిమాలో ఒక పాత్రలో నెగెటివ్ షేడ్స్ తో కనిపించిన ఎన్టీఆర్, ఈ సారి పూర్తి స్థాయిలో విలనిజాన్ని చూపించనున్నాడని అంటున్నారు. ఈ ప్రచారంపై మేకర్స్ ఏమంటారో చూడాలి మరి. 

More Telugu News