50వ వసంతంలోకి ఏపీఐఐసీ.. గోల్డెన్ జూబ్లీ లోగో ఆవిష్కరించిన సీఎం జగన్
- 1973లో ప్రారంభమైన ఏపీఐఐసీ
- రూ.20 కోట్ల మూలధనంతో ప్రస్థానం ప్రారంభం
- రాష్ట్ర ప్రగతిలో ఏపీఐఐసీ కీలక భూమిక పోషించాలని జగన్ ఆకాంక్ష
ఏపీఐఐసీ 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంస్థకు చెందిన గోల్డెన్ జూబ్లీ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఏపీఐఐసీ అధికారులు హాజరయ్యారు. పారదర్శక పారిశ్రామిక విధానంతో పారిశ్రామిక వాడల అభివృద్ధికి ఏపీఐఐసీ నిరంతరం కృషిచేయాలని, రాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక పోషిస్తూ ముందుకు సాగాలని జగన్ ఆకాంక్షించారు.