మ‌హిళ‌ల‌తో క‌లిసి బ‌తుక‌మ్మ ఆట ఆడిన కేఏ పాల్‌

26-09-2022 Mon 15:56
  • మునుగోడులో ప‌ర్య‌టించిన కేఏ పాల్‌
  • చౌటుప్ప‌ల్‌లో స్థానిక మ‌హిళ‌ల‌తో క‌లిసి బ‌తుక‌మ్మ ఆట ఆడిన వైనం
  • పాల్‌పై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు, విమ‌ర్శ‌లు, సెటైర్ల వ‌ర్షం
ka paul participates in batukamma fest in choutuppal
ప్ర‌జా శాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ ఆదివారం న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాతో త్వ‌ర‌లో మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక జ‌ర‌గనున్న నేప‌థ్యంలోనే కేఏ పాల్ ఆదివారం మునుగోడు ప‌రిధిలోని చౌటుప్ప‌ల్‌లో ప‌ర్య‌టించారు. ఆదివారం రాత్రి వేళ త‌న కోడ‌లు జ్యోతి బెగ‌ల్‌తో క‌లిసి చౌటుప్పల్ వచ్చిన ఆయ‌న స్థానిక మ‌హిళ‌ల‌తో ఉత్సాహంగా బ‌తుక‌మ్మ ఆట ఆడారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

బ‌తుక‌మ్మ ఆట ఆడుతున్న కేఏ పాల్‌పై కొంద‌రు నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తుంటే... మ‌రికొంద‌రు మాత్రం తీవ్ర వ్యాఖ్య‌ల‌తో విమ‌ర్శిస్తున్నారు. ఇక మ‌రికొంద‌రేమో కేఏ పాల్‌ది విచిత్ర మ‌న‌స్త‌త్వ‌మ‌ని చెబుతూ సెటైరిక్ కామెంట్లు చేస్తున్నారు. ర‌వి కొండ‌ప‌ల్లి అనే ఓ నెటిజ‌న్ అన్నా పార్టీ గుర్తింపు రద్దు చేసింది ఎలక్షన్ కమీషన్ అంటున్నారు నిజమేనా? అదే నిజమైతే మీరు అమెరికా అద్యక్షుడితో మాట్లాడి రష్యాతో యుద్ధం చేసి చైనాతో శాంతి చర్చలు జరపాలి. అప్పుడే ఎలక్షన్ కమీషన్ మీ కాలిబర్ చూసి భయపడుతుంది అంటూ త‌నదైన శైలిలో సెటైర్ సంధించారు.