KA Paul: మునుగోడులో మా అభ్యర్థిని గెలిపిస్తే.. మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తా: కేఏ పాల్ హామీ

Praja Shanthi Party Chief KA Paul says if their party wins in munugodu built multi Specialty hospital
  • మునుగోడులో 59వ బర్త్‌డే జరుపుకున్న కేఏ పాల్
  • వీసా కోసం 59 మందికి లక్కీ డ్రా నిర్వహణ
  • రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని ఆగ్రహం
  • తమ అభ్యర్థిని గెలిపిస్తే ఆరు నెలల్లో మునుగోడును అమెరికా చేస్తానన్న పాల్
మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అదిరిపోయే హామీ ఇచ్చారు. త్వరలో ఇక్కడ జరగనున్న ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మల్టీస్పెషాలిటీ ఆసుపత్రితోపాటు కార్పొరేట్ స్థాయి పాఠశాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కేఏ పాల్ 59వ పుట్టిన రోజు సందర్భంగా నిన్న మునుగోడులో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా 59 మందికి వీసా లక్కీ డ్రా తీశారు. డ్రాలో గెలుపొందిన వారిని అమెరికా పంపించనున్నారు. 

సభకు హాజరైన వారిని ఉద్దేశించి పాల్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆర్థికంగా మెరుగ్గా ఉన్న రాష్ట్రాన్ని ప్రభుత్వం అప్పులపాలు చేసిందన్నారు. ఉప ఎన్నిక కోసం పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించినా టీఆర్ఎస్ ఇంకా ప్రకటించలేదన్నారు. తమ అభ్యర్థిని గెలిపిస్తే ఆరు నెలల్లో మునుగోడును అమెరికా చేస్తానని, నియోజకవర్గంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా గాయకుడు గద్దర్ కూడా పాల్గొన్నారు.
KA Paul
Munugodu
By Poll
TRS
Praja shanthi Party

More Telugu News