అల్లు అర్జున్ అభిమానుల జాబితాలో బాలీవుడ్ హీరో

25-09-2022 Sun 18:11
  • పుష్పతో బన్నీకి ఆలిండియా క్రేజ్
  • లైవ్ చాట్ నిర్వహించిన టైగర్ ష్రాఫ్
  • సౌత్ లో ఫేవరెట్ స్టార్ ఎవరని అడిగిన అభిమాని
  • అల్లు అర్జున్ అంటూ బదులిచ్చిన ష్రాఫ్
  • పోస్టు వైరల్
Bollywood hero Tiger Shroff says his favorite south star is Allu Arjun
పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ క్రేజ్ ఉత్తరాది రాష్ట్రాలకు కూడా పాకింది. ఈ చిత్రం సాధారణ ప్రేక్షకులనే కాదు, సెలబ్రిటీలను సైతం విశేషంగా ఆకట్టుకుంది. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటనకు ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు. 

తాజాగా, బన్నీ అభిమానుల జాబితాలో బాలీవుడ్ యువ హీరో టైగర్ ష్రాఫ్ కూడా చేరాడు. ఇటీవల టైగర్ ష్రాఫ్ సోషల్ మీడియాలో లైవ్ నిర్వహించాడు. మీరు బాగా మెచ్చే సౌతిండియా స్టార్ ఎవరని అభిమాని అడగ్గా, అల్లు అర్జున్ అంటూ ష్రాఫ్ వెంటనే బదులిచ్చాడు.

ఇదే అంశాన్ని ష్రాఫ్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లోనూ పంచుకోవడంతో బన్నీ అభిమానులు విశేషంగా స్పందించి ఆ పోస్టును వైరల్ చేశారు. 

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. తెలుగు కలెక్షన్ల తరహాలో హిందీలోనూ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి సీక్వెల్ లో నటిస్తున్నారు. పుష్ప తొలిభాగం బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో, రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.