VV Lakshminarayana: సీబీఐలో పని చేసేటప్పుడు చంపేస్తామని లేఖలు వచ్చేవి: మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ

I received threat letters when I was in CBI says VV Lakshminarayana
  • సమాజంలో సామాన్యుల కంటే అవినీతిపరులే నిర్భయంగా తిరుగుతున్నారన్న లక్ష్మీనారాయణ 
  • అవినీతిని నిర్మూలించాలంటే మూలాలకు వెళ్లి చికిత్స చేయాలని వెల్లడి 
  • డబ్బులు లేని ఎన్నికల విధానం రావాలని ఆకాంక్ష 
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన విషయాన్ని వెల్లడించారు. తాను సీబీఐలో పని చేసేటప్పుడు ఎర్ర సిరాతో రాసిన లేఖలు వచ్చేవని... తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని లేఖల్లో రాసేవారని చెప్పారు. మన సమాజంలో సామాన్యుల కంటే అవినీతిపరులే నిర్భయంగా తిరుగుతున్నారని అన్నారు. అవినీతిని నిర్మూలించాలంటే మూలాలకు వెళ్లి చికిత్స చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

బేగంపేటలో ఈరోజు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మీనారాయణ పైవ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని... డబ్బులు లేని ఎన్నికల విధానం రావాలని ఆకాంక్షించారు.
VV Lakshminarayana
CBI
Corruption

More Telugu News