గాడ్​ ఫాదర్​ ప్రీ రిలీజ్​ డేట్​ ఫిక్స్​.. ఈవెంట్​ ఎక్కడంటే

25-09-2022 Sun 14:35
  • ఈ నెల 28న అనంతపురంలో వేడుక
  • ప్రకటించిన చిత్ర బృందం
  • దసరా కానుకగా వచ్చే నెల 5న చిత్రం విడుదల
Godfather Grand Pre Release Event on 28th from 6 PM at Anantapur
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’. ‘లూసిఫర్’కి రిమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో చిరు రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించాడు. తొలిసారి నెరిసిన గడ్డంతో తన వయసుకు తగ్గ పాత్రలో నటించాడు. అంతే కాదు ఈ చిత్రంలో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్‌ కూడా కీలక పాత్రలో నటించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.  

మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ కు అద్బుత స్పందన వచ్చింది. మరోవైపు చిత్ర బృందం ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది. ఈ క్రమంలో గాడ్ ఫాదర్ మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్రకటించింది. ఈ నెల 28న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని నిర్ణయించింది. అయితే, హైదరాబాద్ బదులు అనంతపురంను వేదికగా ఎంచుకుని ఆశ్చర్య పరిచింది. 

ఈ బుధవారం నగరంలోని ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 5న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.