Star Maa: ప్రెస్ నోట్: ఆదివారం విత్ స్టార్ మా పరివారం

Star Maas AADIVAARAM with STAR MAA PARIVAARAM
ప్రెస్ నోట్: ఆదివారం అంటే హాలిడే సందడి. ఆదివారం అంటే ఫుల్ ఎంటర్ టైన్మెంట్. ఆదివారం అంటే ఫామిలీ అందరూ కలిసి కూర్చుని సరదాగా గడిపే రోజు. వీటన్నిటినీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేందుకు స్టార్ మా వినూత్నమైన ఆలోచనతో సరికొత్త షో రూపొందించింది. ఆ షో పేరు "ఆదివారం విత్ స్టార్ మా పరివారం".
 
పాటలతో పాటు ఎన్నో ఆటలు ఆడించి, ఆనందం, ఆహ్లాదంతోపాటు కావాల్సినంత వినోదం పంచే ఈ షో ఈ రోజు నుంచి (సెప్టెంబర్ 25) స్టార్ మా ప్రేక్షకులకు విందు చేయబోతోంది. యాంకరింగ్ సంచలనం శ్రీముఖి ఈ షో ని తన సహజమైన ఎనర్జీ తో  సందడిగా ఉత్సాహంగా ఉల్లాసంగా నడిపించబోతోంది.
 
మధ్యాహ్నం 11 గంటల నుంచి 1 గం. వరకు రెండు గంటలపాటు ఈ నాన్ స్టాప్ వినోదం.. ఆదివారాన్ని మరింత మీనింగ్ ఫుల్ గా మార్చబోతోంది. స్టార్ మా సీరియల్స్ లో రోజూ ప్రేక్షకుల్ని అలరించే "స్టార్ మా పరివారం" అందరూ సిరీస్ మొత్తం ఎంతో అద్భుతంగా వినూత్నంగా వినోదాన్ని అందించబోతున్నారు. ఊహించినదాని కన్నా ఎక్కువగా... కోరుకున్నదానికంటే నెక్స్ట్ లెవెల్ లో వుండబోతోంది "ఆదివారం విత్ స్టార్ మా పరివారం".
 
మ్యూజిక్ తో ఫన్.. మ్యూజిక్ తో ఎంటర్ టైన్మెంట్... మ్యూజిక్ తో మేజిక్.. సింపుల్ గా ఇదే "ఆదివారం విత్ స్టార్ మా పరివారం". డోంట్ మిస్. 
 
"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/cAMCAol0gO8
 
Content Produced by: Indian Clicks, LLC
Star Maa
AADIVAARAM with STAR MAA PARIVAARAM

More Telugu News