Congress: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు

  • నేషనల్ హెరాల్డ్ కేసులో టీపీసీసీ నేతలకు ఈడీ నోటీసులు
  • షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, రేణుకా చౌదరి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ లకు నోటీసులు 
  • ఈ నెల 10న ఢిల్లీలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశం
ed issues notices to tpcc leaders in national herald case

నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి తాజాగా ఆ పార్టీకి చెందిన తెలంగాణ శాఖ (టీపీసీసీ)కి చెందిన నేతలకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం నోటీసులు జారీ చేసింది. టీపీసీసీకి చెందిన ఐదుగురు కీలక నేతలను విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం.   

ఈడీ నోటీసులు జారీ అయిన వారిలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 10న ఢిల్లీలోని తమ కార్యాలయంలో జరగనున్న విచారణకు హాజరు కావాలని వీరిని ఈడీ అధికారులు కోరారు. ఈడీ నోటీసుల విషయంపై స్పందించిన షబ్బీర్ అలీ... తనకు ఇప్పటిదాకా ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు. ఒకవేళ నోటీసులు వస్తే విచారణకు హాజరు అవుతానని కూడా ఆయన చెప్పారు.

More Telugu News