YSRCP: మంత్రి విశ్వరూప్ కు మరోమారు అస్వస్థత... చికిత్స కోసం ముంబై తరలింపు

ap minister viswaroop rushed to mumbai for treatment
  • ఇటీవలే ఓ సారి అస్వస్థతకు గురైన విశ్వరూప్
  • తాజాగా మరోమారు అనారోగ్యానికి గురైన ఏపీ మంత్రి
  • గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు తేల్చిన వైద్యులు
ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ శుక్రవారం మరోమారు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయనను కుటుంబ సభ్యులు ముంబైకి తరలించారు. గుండె సంబంధిత సమస్యలతో విశ్వరూప్ బాధపడుతున్నట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. 

ఈ నెల 2న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిలో పాల్గొన్న సందర్భంగా విశ్వరూప్ ఒక్కసారిగా అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరంలో ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం... మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్ కు తరలించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోమారు విశ్వరూప్ అస్వస్థతకు గురవడంతో ఆయనను ముంబై తరలించారు.
YSRCP
Andhra Pradesh
Pinipe Viswarup
Mumbai

More Telugu News