ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'గీత సాక్షిగా' టీజర్

22-09-2022 Thu 18:12
  • విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న 'గీత సాక్షిగా'
  • అవినీతి .. అన్యాయాలపై తిరగబడే యువకుడి కథ ఇది
  • కథానాయికగా కనిపించనున్న చిత్రా శుక్లా 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు  
Geeta Sakshiga Teaser Release
పుష్పక్ -  జేబీ హెచ్ ఆర్ ఎన్ కె ఎల్ సమర్పణలో చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై 'గీత సాక్షిగా' రూపొందుతోంది. ఆంథోని మట్టిపల్లి దర్శకత్వంలో చేతన్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇంతకు ముందు ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ పోస్టర్‌, మోషన్ పోస్టర్స్ విడుదల చేసినప్పటి నుండి ప్రేక్షకులలో ఆసక్తితో పాటు అంచనాలను పెంచుతూ విశేషంగా ఆకట్టుకుంటోంది. 

తాజాగా ఈ చిత్రం నుండి ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ తో మరో అద్భుతమైన టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే ఇది కోర్ట్ డ్రామాగా ఉండబోతోందని తెలుస్తుంది. రాజా రవీంద్ర, లాయర్‌ శ్రీకాంత్ అయ్యంగార్‌, పోలీస్ ఆఫీసర్ ఇలా ముగ్గురూ కలసి నటుడు ఆదర్శ్ ను టార్గెట్ చేసినట్లు టీజర్ లో కనిపిస్తోంది. "పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యుడిని కాదు .. వాడి బాబు అర్జునుడినిరా" అంటూ నటుడు ఆదర్స్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్‌ తర్వాత సిక్స్ ప్యాక్ బాడీ తో తను చేసే ఫైట్ చూస్తుంటే అందరిలో ఈ కథపై మరింత కుతూహలం కలుగుతోంది.  

ఈ సినిమాకు  అద్భుతమైన విజువల్స్‌తో, BGMతో అందరినీ అలరిస్తుంది అని చెప్పవచ్చు. శ్రీకాంత్ అయ్యంగార్, రూపేష్ శెట్టి, భరణి శంకర్, జయలలిత, అనిత చౌదరి, రాజా రవీంద్ర లతో పాటు అనేకమంది సీనియర్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. వెంకట్ హ‌నుమ నరిసేటి సినిమాటోగ్ర‌ఫీ, కిషోర్ మ‌ద్దాలి ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అక్కట్టుకుంటుందనే ఆశాభావాన్ని నిర్మాతలు వ్యక్తం చేశారు.