VV Lakshminarayana: పేరు మార్పు కాదు.. వ్యవస్ధల రిపేరు కావాలి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

cbi ex jd vv lakshmi narayana respondson ntr health vesity name change
  • ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును మార్చిన వైసీపీ సర్కారు
  • తమిళనాడు రాజకీయాలతో పోలుస్తూ వైసీపీ నిర్ణయాన్ని తప్పుబట్టిన సీబీఐ మాజీ జేడీ
  • జయలలిత బొమ్మలున్న స్కూల్ బ్యాగులను స్టాలిన్ పంచారని గుర్తు చేసిన వైనం
ఏపీలోని వైసీపీ సర్కారు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును మార్చిన వైనంపై సీబీఐ మాజీ జేడీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వి వి లక్ష్మీనారాయణ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం దిగిపోయి... డీఎంకే ప్రభుత్వ పాలన అమలయ్యాక చోటుచేసుకున్న ఘటనలను గుర్తు చేస్తూ ఆయన ఏపీ సర్కారు తీరును విమర్శించారు. 

మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో సీఎంగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ మాజీ సీఎం జయలలిత బొమ్మలతో ఉన్న స్కూల్ బ్యాగులను పంపిణీ చేసి, తన ఔన్నత్యాన్ని చాటారని లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. అయితే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఇక్కడి పాలకులు మారినపుడల్లా పేర్లు మార్చుకుంటూ నానా యాగీ చేస్తున్నామని ఆయన అన్నారు. అయినా పేరు మార్పు కాదు... వ్యవస్ధల రిపేరు కావాలంటూ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.
VV Lakshminarayana
CBI Ex JD
YSRCP
NTR Health Versity
Tamilnadu

More Telugu News