25న ఉప్పల్‌లో ఇండియా-ఆస్ట్రేలియా పోరు.. జింఖానాలో నేటి నుంచే టికెట్ల విక్రయం

22-09-2022 Thu 08:51
  • నేటి ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు టికెట్ల విక్రయం
  • జాప్యాన్ని నిరసిస్తూ అభిమానుల ఆందోళన
  • తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైన ఇండియా
Uppal match tickets available from today10 am
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఈ నెల 25న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లను నేటి నుంచి ఆఫ్‌లైన్‌లో విక్రయించనున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తెలిపింది. నేటి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టికెట్లను విక్రయించనున్నట్టు హెచ్‌సీఏ పేర్కొంది. మరోవైపు, టికెట్ల విక్రయంలో జాప్యాన్ని నిరసిస్తూ అభిమానులు ఈ ఉదయం జింఖానా మైదానం వద్ద ఆందోళనకు దిగారు. 

కాగా, మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించినప్పటికీ దానిని కాపాడుకోవడంలో విఫలమైన టీమిండియా పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే సిరీస్ ఫలితం చివరి మ్యాచ్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. లేదంటే సిరీస్ ఆస్ట్రేలియా సొంతమవుతుంది.