'టాయిలెట్‌లో క‌బ‌డ్డీ ప్లేయ‌ర్ల‌కు భోజ‌నం'పై యూపీ సీఎంకు ఫిర్యాదు చేసిన శిఖ‌ర్ ధావ‌న్‌

21-09-2022 Wed 21:07
  • క‌బ‌డ్డీ ప్లేయ‌ర్ల‌కు టాయిలెట్‌లో భోజ‌నం పెట్టిన వైనం
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన వీడియో
  • బాధ్యులపై త‌గిన రీతిలో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గ‌బ్బ‌ర్ డిమాండ్‌
Shikhar Dhawan complains over kavaddi players video to up cmyogi adityanath
రాష్ట్ర స్థాయి క‌బ‌డ్డీ టోర్న‌మెంట్‌లో పాల్గొనేందుకు వెళ్లిన బాలిక‌ల క‌బ‌డ్డీ జ‌ట్టు స‌భ్యుల‌కు టాయిలెట్‌లో భోజ‌నం వ‌డ్డించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ వీడియోపై తాజాగా టీమిండియా స్టార్ క్రికెట‌ర్ శిఖర్ ధావ‌న్ బుధ‌వారం రాత్రి స్పందించాడు. ఈ ఘ‌ట‌న త‌న‌ను తీవ్ర ఆవేద‌న‌కు గురి చేసింద‌ని త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఈ ఘ‌ట‌న‌పై దృష్టి సారించాల‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్, ఆ రాష్ట్ర క్రీడా శాఖ‌ను కోరాడు. ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారిపై త‌గిన రీతిలో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని శిఖర్ డిమాండ్ చేశాడు.