Samantha: సమంతకు అసలేమైంది?... స్పందించిన మేనేజర్

Samantha manager reacts to rumors
  • ఇటీవల పబ్లిక్ కు దూరంగా సమంత
  • సోషల్ మీడియాలోనూ సైలెన్స్
  • విజృంభించిన ఊహాగానాలు
  • అనారోగ్యంపాలైందని కథనాలు
  • విదేశాల్లో చికిత్స పొందుతోందని పుకార్లు
ఇటీవల సమంత కొన్నిరోజులుగా పబ్లిక్ లో కనిపించడంలేదు. సోషల్ మీడియాలోనూ ఆమె నుంచి పోస్టులు రావడంలేదు. చివరిసారిగా సెప్టెంబరు 10వ తేదీన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. అప్పటి నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. 

దాంతో, సమంత అనారోగ్యంపాలైందని, అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతోందని ప్రచారం మొదలైంది. ప్రస్తుతం విదేశాల్లోనే ఉంటూ చికిత్స పొందుతోందని కథనాలు వినిపించాయి. 

దీనిపై సమంత మేనేజర్ మహేంద్ర స్పందించారు. జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజంలేదని స్పష్టం చేశారు. సమంత ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న కథనాలను ఖండించారు. ఇవన్నీ పుకార్లేనని, ఎవరూ నమ్మవద్దని కోరారు. అయితే, సమంత ఎక్కడున్నదీ మాత్రం మేనేజర్ వెల్లడించలేదు. 

సమంత ప్రస్తుతం యశోద, శాకుంతలం వంటి చిత్రాల్లో నటిస్తోంది. త్వరలోనే బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వచ్చాయి.
Samantha
Rumors
Manager
Tollywood
Kollywood

More Telugu News