పేరు మార్చకపోతే చరిత్ర కూడా జగన్ ను క్షమించదు!: కాల్వ శ్రీనివాసులు

21-09-2022 Wed 14:25
  • ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరును మార్చిన వైసీపీ ప్రభుత్వం
  • సీఎం జగన్ పై మండిపడిన కాల్వ శ్రీనివాసులు  
  • యూనివర్శిటీ పెట్టిన సమయంలో వైఎస్సార్ ఎక్కడున్నారని ప్రశ్నించిన కాల్వ 
Kalva Sreenivasulu response on NTR university name change
ఏపీలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చి... దానికి వైఎస్సార్ పేరును పెట్టేందుకు ఏపీ అసెంబ్లీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పై మండిపడ్డారు. హెల్త్ యూనివర్శిటీ పెట్టిన సమయంలో రాజశేఖరరెడ్డి ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. పేరు మార్చకపోతే చరిత్ర కూడా జగన్ ను క్షమించదని చెప్పారు.