Prakash Raj: ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకున్న గ్రామంపై కేటీఆర్ ప్రశంసలు

KTR praises Prakash Raj
  • షాద్ నగర్ నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లి  గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రకాశ్ రాజ్
  • గ్రామంలో పలు అభివృద్ధి పనులను చేపట్టిన వైనం 
  • గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందన్న కేటీఆర్
ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ గ్రామాభివృద్ధికి ప్రకాశ్ రాజ్ ఎంతో చొరవ తీసుకున్నారు. పలు అభివృద్ధి పనులను చేపట్టారు. సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ ను, దిమ్మెలను ఏర్పాటు చేయించి, గ్రామాభివృద్ధికి ఆయన ఎంతో చేశారు. గ్రామంలో చెట్లను పెంచి పచ్చని వాతావరణాన్ని నెలకొల్పారు. అలాగే ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ పై మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకున్న గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్యతో కలిసి గొప్ప పురోగతిని సాధించారని ప్రశంసించారు.
Prakash Raj
Adopted Village
KTR
TRS

More Telugu News