Hardik Pandya: ఆసీస్ బౌలింగ్ ను ఊచకోత కోసిన హార్దిక్ పాండ్యా... భారత్ భారీ స్కోరు

Hardik Pandya sensational innings drives India huge total against Aussies
  • మొహాలీలో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్
  • 30 బంతుల్లోనే 71 పరుగులు చేసిన పాండ్యా
  • పాండ్యా స్కోరులో 7 ఫోర్లు, 5 సిక్సులు
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 రన్స్ చేసిన టీమిండియా
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విధ్వంసక బ్యాటింగ్ తో మొహాలీలో ఆస్ట్రేలియాకు చుక్కలు కనిపించాయి. టాస్ ఓడిన టీమిండియా మొదట బ్యాటింగ్ కు దిగగా, మిడిలార్డర్ లో వచ్చిన హార్దిక్ పాండ్యా మెరుపుదాడి చేశాడు. పాండ్యా కేవలం 30 బంతుల్లో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 7 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. 

పాండ్యా సంచలన ఇన్నింగ్స్ సాయంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 55, సూర్యకుమార్ యాదవ్ 46 పరుగులు చేశారు. 

రోహిత్ 11, కోహ్లీ 2, దినేశ్ కార్తీక్ 6, అక్షర్ పటేల్ 6 పరుగులు చేసి అవుటయ్యారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3, హేజెల్ వుడ్ 2, కామెరాన్ గ్రీన్ 1 వికెట్ తీశారు.
Hardik Pandya
Team India
Australia
Mohali
1st T20

More Telugu News