Women: ఒక్కడిని చుట్టుముట్టి.. షర్టు చింపి.. చితక్కొట్టిన యువతులు.. వీడియో ఇదిగో

Women angrily tear off young mans shirt at raipur airport
  • ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ విమానాశ్రయం బయట ఘటన
  • డబ్బుల విషయంలో వారి మధ్య గొడవ వచ్చిందన్న ప్రత్యక్ష సాక్షులు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో.. భిన్నంగా కామెంట్లు
అది రాయ్ పూర్ ఎయిర్ పోర్టు ఆవరణ.. కొందరు యువతులు గుంపుగా ఉన్నారు. అక్కడో యువకుడు ఉన్నాడు. వారి మధ్య ఏదో వాగ్వాదం జరుగుతోంది. కాసేపటికే అది గొడవగా మారింది. యువతులంతా కలిసి ఆ యువకుడిని కొట్టడం మొదలుపెట్టారు. అన్ని వైపుల నుంచి తలా ఓ దెబ్బ వేశారు. తప్పించుకునేందుకు ఆ యువకుడు ప్రయత్నించినా.. గట్టిగా పట్టేసుకుని దాడి చేశారు. అతడి షర్టును కూడా పట్టుకుని లాగుతూ కొట్టడంతో ఆ పెనుగులాటలో అతడి షర్టు కూడా చిరిగిపోయింది.
  • చివరికి ఆ యువకుడు వారిని విడిపించుకుని పక్కకు వెళ్లిపోయాడు. ఇదంతా కూడా విమానాశ్రయం ఆవరణలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. అక్కడున్న కొందరు ఈ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు.
  • ఆ యువకుడికి, యువతులకు మధ్య డబ్బుల విషయంలో వివాదం తలెత్తి గొడవగా మారిందని.. ఆగ్రహంతో యువతులు అతడిపై దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
  • ఈ ఘటన తర్వాత యువతులు, ఆ యువకుడు ఒకరిపై ఒకరు సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
  • ‘అసలు విమానాశ్రయంలో సెక్యూరిటీ ఏమైనట్టు? అంత మంది యువతులు కలిసి ఒక్కడిని కొడుతుంటే ఏం చేస్తున్నారు?’ అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా.. ‘మహిళల సాధికారతకు ఇది మరో రూపం..’ అంటూ మరికొందరు అంటున్నారు.
  • ‘అలా యువకుడిని అంత మంది యువతులు కొడితే.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అందరికీ సమాన న్యాయం వర్తిస్తుందా?’ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
Women
Women beat a man
Raipur
Chattisgarh
India
Offbeat
Viral Videos

More Telugu News