uber: ఉబర్ కంపెనీపై సైబర్ దాడి

  • ఉద్యోగి యాప్, వర్క్ స్పేస్ మెసేజింగ్ యాప్ లోకి  చొరబడ్డ హ్యాకర్లు
  • తమ అంతర్గత సిస్టమ్స్ ను  యాక్సెస్ చేసినట్టు ధ్రువీకరించిన ఉబర్
  • వినియోగదారుల సమాచారం మాత్రం బహిర్గతం కాలేదని వెల్లడి
Uber confirms its internal systems were hacked

అమెరికాకు చెందిన ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ, ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటర్నెట్ ట్యాక్సీ ఉబర్ హ్యాకింక్ కు గురైంది. సంస్థకు చెందిన ఓ ఉద్యోగి యాప్, వర్క్ స్పేస్ మెసేజింగ్ యాప్ లోకి హ్యాకర్లు చొరబడటంతో ఉబర్ డేటా ఉల్లంఘనకు గురైంది. ఈ విషయాన్ని ఉబర్ ధ్రువీకరించింది. 

గత ఏడాది నుంచి చురుగ్గా ఉన్న ‘లాప్సస్$’ అనే హ్యాకింగ్ గ్రూప్‌ తమపై ఈ సైబర్ దాడికి పాల్పడిందని ఉబర్ వెల్లడించింది. టెక్నాలజీ కంపెనీలను హ్యాక్ చేసేందుకు లాప్సన్ ఈ పద్ధతులను పాటిస్తోందని, ఈ ఏడాదిలోనే మైక్రోసాఫ్ట్, సిస్కో, శామ్‌సంగ్, ఎన్విడియా, ఓక్టా వంటి వాటిపై కూడా సైబర్ దాడి చేసిందని ఉబెర్ పేర్కొంది. గత వారమే ఉబర్ పై సైబర్ దాడి జరిగిందని వార్తలు వచ్చాయి. కానీ అప్పుడు దాడి పరిధి అస్పష్టంగా ఉంది. 

హ్యాకర్లు అనేక అంతర్గత సిస్టమ్‌లను యాక్సెస్ చేసినట్లు ఉబెర్ ఇప్పుడు స్పష్టం చేసింది. అయితే, ఏదైనా మెటీరియల్ ఇంపాక్ట్ ఉందా? అన్నదానిపై కంపెనీ ఇంకా దర్యాప్తు చేస్తోంది. కాగా, హ్యాకర్లు తమ కంపెనీ మొబైల్ యాప్‌లకు శక్తినిచ్చే ‘ప్రొడక్షన్ సిస్టమ్‌లను’ యాక్సెస్ చేయలేదని ఉబర్ పేర్కొంది. కాబట్టి వినియోగదారుల ఖాతాలు, క్రెడిట్ కార్డ్ నంబర్‌లు, బ్యాంక్ ఖాతా సమాచారం, ట్రావెల్ హిస్టరీ వంటి సున్నితమైన సమాచారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే డేటా బేస్‌లు కూడా సురక్షితంగా ఉన్నాయని కంపెనీ హామీ ఇచ్చింది. తమ వినియోగదారుల క్రెడిట్ కార్డు సమాచారంతో పాటు వ్యక్తిగత డేటాను చాలా భద్రంగా ఉంచుతామని, అదనపు రక్షణ కల్పిస్తామని ఉబర్ తెలిపింది.

More Telugu News