Telugudesam: ఏపీ అసెంబ్లీ సమీపంలో ఓ భవనంపైకి ఎక్కి ఆందోళన చేపట్టిన టీడీపీ నేతలు.. అరెస్ట్!

TDP leaders protest on a building near AP Assembly
  • జగన్ దళిత ద్రోహి అంటూ నినాదాలు
  • ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను విడుదల చేయాలని డిమాండ్
  • టీడీపీ నేతలను భవనం పైనుంచి కిందకు దింపిన పోలీసులు
వైసీపీ ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ముట్టడికి టీడీపీకి చెందిన పలువురు నేతలు యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో... అసెంబ్లీకి సమీపంలో ఉన్న ఓ భవనం పైకి వారు ఎక్కారు. భవనంపై ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆందోళన చేపట్టిన నేతల్లో కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ నేతలు ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ దళిత ద్రోహి అంటూ వారు నినాదాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా భవనం పైనుంచి కిందకు దించారు. వారిని అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి తరలించారు.
Telugudesam
Leaders
AP Assembly

More Telugu News