Congress: స్నేక్ బోటు రేసులో రాహుల్ గాంధీ.. ప‌డవ ఎక్కి తెడ్డేసిన వైనం

rahul gandhi participated snake boat race in kerala
  • క‌న్యాకుమారి నుంచి యాత్ర‌ను ప్రారంభించిన రాహుల్‌
  • ప్ర‌స్తుతం కేర‌ళ‌లో కొన‌సాగుతున్న భార‌త్ జోడో యాత్ర‌
  • స్నేక్ బోట్ రేసులో పాల్గొన్న కాంగ్రెస్ నేత‌
భార‌త్ జోడో యాత్ర పేరిట క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ దాకా సుదీర్ఘ పాద‌యాత్ర‌కు తెర తీసిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ...త‌న యాత్ర‌లో ఉత్సాహంగా క‌నిపిస్తున్నారు. దారిలో త‌న‌ను క‌లిసేందుకు వ‌స్తున్న వివిధ వ‌ర్గాల‌ను అక్కున చేర్చుకుంటున్న రాహుల్ గాంధీ...ఆయా స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారిస్తున్నారు. త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారిలో ప్రారంభ‌మైన ఈ యాత్ర ప్ర‌స్తుతం కేర‌ళ‌లో కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

సోమ‌వారం నాటి యాత్ర‌లో భాగంగా కేర‌ళ‌లోని ఓ వాగులో జ‌రిగిన స్నేక్ బోట్ రేసులో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌డ‌వ సిబ్బంది, పార్టీ నేత‌ల‌తో క‌లిసి ఉత్సాహంగా తెడ్డేశారు. తెడ్డేసిన నేప‌థ్యంలో కాస్తంత అల‌స‌ట వ‌చ్చిన‌ట్లు క‌నిపించిన రాహుల్ గాంధీ... త‌న కుడి చేతి భుజాన్ని ఎడ‌మ చేతితో రుద్దుకున్నారు. ఇలా ప‌డ‌వ ఎక్కి తెడ్డేసిన రాహుల్ గాంధీ వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.
Congress
Rahul Gandhi
Kerala
Bharat Jodo Yatra
Snake Boat Race

More Telugu News