Andhra Pradesh: ఎడ్ల బండి కాడి మోస్తూ అసెంబ్లీకి నారా లోకేశ్... వీడియో ఇదిగో

tdp leaders went assembly with a bullock cart on their shoulders
  • సోమ‌వారం అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో టీడీపీ వినూత్న నిర‌స‌న‌
  • వైసీపీ ప్ర‌భుత్వాన్ని రైతు వ్య‌తిరేకిగా అభివ‌ర్ణిస్తూ ఆందోళ‌న‌
  • భుజంపై ఎడ్ల బండి కాడిని పెట్టుకుని సాగిన నారా లోకేశ్
ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా మూడో రోజైన సోమ‌వారం ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. వైసీపీ స‌ర్కారు తీరును నిర‌సిస్తూ విప‌క్ష టీడీపీ స‌భ్యులు నిత్యం ప్ల‌కార్లులు ప‌ట్టుకుని అసెంబ్లీ స‌మావేశాల‌కు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సోమ‌వారం వైసీపీ స‌ర్కారును రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వంగా అభివర్ణిస్తూ టీడీపీ నేత‌లు వినూత్న నిర‌స‌న‌కు దిగారు. ఈ సంద‌ర్భంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎడ్ల బండి కాడిని మోస్తూ అసెంబ్లీకి వెళ్లారు.

ఈ వినూత్న నిర‌స‌న‌కు టీడీపీ అగ్ర నేత‌, ఎమ్మెల్సీ నారా లోకేశ్ నేతృత్వం వ‌హించారు. అంతేకాకుండా ఎడ్ల బండి కాడిని ఆయ‌న త‌న భుజంపై పెట్టుకుని మోశారు. రైతు ద్రోహిగా నిలుస్తున్న సీఎం జ‌గ‌న్ రైతు వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌డుతూ ఈ వినూత్న నిర‌స‌న‌కు దిగిన‌ట్లు టీడీపీ నేత‌లు తెలిపారు.
Andhra Pradesh
AP Assembly Session
TDP
Nara Lokesh
YSRCP

More Telugu News