నవంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఎల్లుండి విడుదల చేయనున్న టీటీడీ

19-09-2022 Mon 17:13
  • ఆన్ లైన్ లో ఉదయం 9 గంటలకు విడుదల
  • అదే రోజున ఇతర సేవల టికెట్ల విడుదల
  • మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులోకి టికెట్లు
TTD will release November quota Srivari Darshan Tickets on September 21
నవంబరు నెల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ ఎల్లుండి (సెప్టెంబరు 21) విడుదల చేయనుంది. రూ.300 విలువ చేసే ఈ టికెట్లు ఆన్ లైన్ లో ఉదయం 9 గంటలకు అందుబాటులోకి వస్తాయని టీటీడీ తెలిపింది. 

ఇక, నవంబరు నెలలో స్వామివారికి నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత సేవా టికెట్లను అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తామని వివరించింది. టికెట్ల లభ్యతను అనుసరించి మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన కేటాయించనున్నట్టు టీటీడీ వెల్లడించింది. 

నవంబరు నెల ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ సెప్టెంబరు 21 నుంచి అందుబాటులో ఉంటుందని తెలిపింది.