మహిళ తియ్యని మాటలకు చిత్తయిన యువకుడు... అతడి నగ్న వీడియోలతో మహిళ బెదిరింపులు

Woman threatens student with his nude videos
  • ఫోన్ ద్వారా యువకుడికి మహిళ పరిచయం
  • క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం
  • నగ్న వీడియోలు పంపాలని కోరిన మహిళ
  • వీడియోలు పంపి లబోదిబోమన్న యువకుడు
  • పోలీసులకు ఫిర్యాదు
మహిళల నగ్న వీడియోలతో బెదిరింపులకు పాల్పడే వ్యక్తుల గురించి తెలిసిందే. కాగా, ఓ మహిళ యువకుడి నగ్న వీడియోలతో బెదిరింపులకు పాల్పడిన ఘటన తాడేపల్లిలో వెలుగులోకి వచ్చింది. 20 ఏళ్ల యువకుడు యూనివర్సిటీలో బీబీఏ కోర్సు చదువుతున్నాడు. అతడికి ఒకరోజు గుర్తు తెలియని మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆమె తియ్యని మాటలకు ఆ యువకుడు పడిపోయాడు. అప్పటినుంచి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. 

కొన్నిరోజుల తర్వాత, నగ్న వీడియోలు తీసి పంపాలని ఆ యువకుడిని సదరు మహిళ కోరింది. ఆమె అడిగిందే తడవుగా పలు నగ్న వీడియోలు తీసి ఆమెకు పంపించాడు. అయితే అతడు ఏమాత్రం ఊహించని విధంగా ఆమె బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడింది. తనకు డబ్బు ఇవ్వకపోతే నగ్న వీడియోలు బయటపెడతానంటూ ఆ యువకుడ్ని బెదిరించసాగింది. 

హడలిపోయిన ఆ యువకుడు ఒకసారి రూ.8 వేలు పంపాడు. అయినప్పటికీ ఆమె నుంచి బెదిరింపులు ఆగకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న తాడేపల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Go Back to Shorts
Woman
Student
Videos
Tadepalli

More Telugu News