బ్రిటన్ కొత్త రాజుతో సమావేశమైన భారత రాష్ట్రపతి ముర్ము
- నిన్న బకింగ్ హామ్ ప్యాలెస్ లో కింగ్ చార్లెస్3తో భేటీ
- నేడు బ్రిటన్ రాణి ఎలిజబెత్2 అంత్యక్రియలు
- హాజరవుతున్న ప్రపంచ దేశాల నాయకులు
ఆమె అంత్యక్రియలకు ప్రపంచ దేశాల నాయకులు, ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో జరిగే ఈ అంత్యక్రియలను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించనున్నారు. విదేశీ రాజ కుటుంబీకులు, ప్రపంచ నాయకులు రాణి కుటుంబంతో కలిసి అంతిమ యాత్రలో పాల్గొంటారు. ఇందుకోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే లండన్ చేరుకున్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మా న్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రెసిడెంట్ సెర్గియో మట్టరెల్లా, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మిచెల్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ తదితరులు కూడా అంత్యక్రియలకు హాజరవుతున్న ప్రముఖుల్లో ఉన్నారు.