చైనాలో ఘోర బస్సు ప్రమాదం... 27 మంది దుర్మరణం

18-09-2022 Sun 15:26
  • గ్విజౌ ప్రావిన్స్ లో దుర్ఘటన
  • 47 మందితో ప్రయాణిస్తున్న బస్సు
  • కియానన్ ప్రాంతంలో బోల్తా
  • ఈ ఏడాది ఇదే అతిపెద్ద రోడ్డు ప్రమాదం
Fatal road accident in China kills 27 people
చైనాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 27 మంది దుర్మరణం పాలయ్యారు. 47 మందితో వెళుతున్న బస్సు బోల్తా కొట్టింది. గ్విజౌ ప్రావిన్స్ లోని ఓ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన 20 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. 

ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇదే అత్యంత తీవ్ర రోడ్డు ప్రమాదం అని భావిస్తున్నారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన కియానన్ ప్రాంతం పర్వతాలతో కూడి ఉంటుంది. ఇక్కడ అనేక ఆదివాసీ తెగలు జీవిస్తుంటాయి. చైనాలోని మారుమూల ప్రాంతాల్లో ఇదొకటి.