దమ్ముంటే నా సవాల్ స్వీకరించండి: అయ్యన్నపాత్రుడు

18-09-2022 Sun 12:57
  • మూడు రాజధానులపై రెఫరెండంకు సిద్ధం
  • అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దాం
  • విశాఖ భూములపై కూడా విచారణ జరిపించాలి
Ayyanna Patrudu challenge to YSRCP
మూడు రాజధానులపై రెఫరెండంకు సిద్ధమా అంటూ మంత్రి అమర్ నాథ్ విసిరిన సవాల్ కు తాము సిద్ధమని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. రెంఫరెండంకు తాము సిద్ధమని చెప్పారు. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని... మూడు రాజధానులే అంశంగా ఎన్నికలకు వెళ్దామని అన్నారు. 

అమరావతిలో టీడీపీ నేతలు భూములు దోచుకున్నారని అసత్య ఆరోపణలు చేస్తున్నారని... అమరావతి భూములతో పాటు, విశాఖ భూములపై కూడా విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని చెప్పారు. అమరావతే రాష్ట్ర రాజధానిగా ఉంటుందని... రాజధాని విషయంలో హైకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తుందని అన్నారు.