రేపు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జనసేన లీగల్ సెల్ సమావేశం
- ఆదివారం మంగళగిరిలో సమావేశం
- ఉదయం 11 గంటలకు సమావేశం
- మధ్యాహ్నం 12 గంటలకు ప్రసంగించనున్న పవన్
రూ.5,55,555 విరాళం అందించిన యూరప్ జనసైనికులు
నా సేన కోసం... నా వంతు..., కౌలు రైతు భరోసా వంటి కార్యక్రమాల కోసం యూరప్ జనసైనికులు జనసేన పార్టీకి రూ.5,55,555 విరాళంగా అందించారు. దీనిపై పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు స్పందించారు. యూరప్ జనసైనికులు భారీ విరాళం అందించడం అభినందనీయమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు మాతృభూమిపై మమకారంతో, పవన్ కల్యాణ్ పై అభిమానంతో జనసేన పార్టీకి అండగా నిలుస్తున్నారని కొనియాడారు. వారందరి నమ్మకాన్ని నిలబెడతామని నాగబాబు స్పష్టం చేశారు.