ఏపీలో కొత్తగా ఎంఈఓ-2 పోస్టు... 679 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
- ఇప్పటికే మండలాల్లో పనిచేస్తున్న ఎంఈఓలు
- వారికి అదనంగా ఎంఈఓ-2 పోస్టులను సృష్టించిన సర్కారు
- అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన వైసీపీ సర్కారు
ఏపీలో దాదాపుగా 20 ఏళ్ల నుంచి ఈ తరహాలో కొత్త పోస్టులను సృష్టించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఏకీకృత సర్వీస్ రూల్స్ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో విద్యా శాఖలో పదోన్నతులు నిలిచిపోయాయి. వెరసి మండల విద్యా శాఖాధికారులపై మోయలేని భారం పడింది. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉంటే... ఎంఈఓ-2 పేరిట కొత్త పోస్టులను సృష్టించిన ఏపీ ప్రభుత్వం... ఆ కేటగిరీలో ఒకేసారి 679 పోస్టులను భర్తీ చేసేందకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే సమయంలో ఇప్పటికే ఉన్న ఎంఈఓ-1 పోస్టుల్లో మరో 13 పోస్టులను ఏర్పాటు చేసేందుకు కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా సృష్టించిన ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ త్వరలోనే మొదలుకానున్నట్లు సమాచారం.