ఇక కోచ్‌గా చేయను: రవిశాస్త్రి

17-09-2022 Sat 14:49
  • హెడ్ కోచ్ గా టీమిండియాకు ఎన్నో విజయాలను అందించిన రవిశాస్త్రి
  • గత ఏడాది ముగిసిన పదవీకాలం
  • కోచ్ గా తన కాలం ముగిసిందన్న శాస్త్రి
I dont want to be coach again says Ravi Shastri
ఆటగాడిగా భారత్ కు ఎన్నో విజయాలను అందించిన రవిశాస్త్రి... హెడ్ కోచ్ గా కూడా టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. రవిశాస్త్రి హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు విదేశాల్లో మన జట్టు చిరస్మరణీయమైన విజయాలను ఎన్నింటినో సాధించింది. 2014లో టీమిండియా డెరెక్టర్ గా వ్యవహరించిన రవిశాస్త్రి... 2017లో హెడ్ కోచ్ గా బాధ్యతలను స్వీకరించాడు. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. జట్టుకు కోచ్ గా విజయాలను అందించిన రవిశాస్త్రి... టీమ్ ఓడిపోయినప్పుడల్లా విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. 

టీమిండియా ఓడిపోయినప్పుడల్లా కెప్టెన్ కోహ్లీని, రవిశాస్త్రి కోచింగ్ ను పలువురు విమర్శించేవారు. రవిశాస్త్రిని తొలగించాలంటూ బీసీసీఐని డిమాండ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు రవిశాస్త్రి పదవీకాలాన్ని పొడిగించాలని బీసీసీఐ భావించినప్పటికీ... ఆయన అంగీకరించలేదు. తాజాగా కోచింగ్ పై రవిశాస్త్రి మాట్లాడుతూ, కోచ్ గా తన కాలం ముగిసిపోయిందని చెప్పారు. భారత క్రికెట్ కు ఎంత చేయాలో అంతా చేశానని అన్నారు. ఇకపై కోచింగ్ ఇచ్చే ఆలోచన లేదని అన్నారు.