పాద‌యాత్ర‌లో రాహుల్ గాంధీని ముద్దు పెట్టుకున్న మ‌హిళ‌.. ఫొటో ఇదిగో

16-09-2022 Fri 20:28
  • క‌న్యాకుమారి నుంచి ప్రారంభ‌మైన యాత్ర‌
  • శుక్ర‌వారం నాటికి 9వ రోజుకు చేరుకున్న భార‌త్ జోడో యాత్ర‌
  • కేర‌ళ‌లో రాహుల్‌ను ముద్దు పెట్టుకున్న న‌డి వ‌య‌సు మ‌హిళ‌
middle age lady isses rahul gandhi in bharat jodo yatra
2024 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌య‌మే ల‌క్ష్యంగా ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర శుక్ర‌వారం నాటికి 9వ రోజుకు చేరుకుంది. త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారిలో మొద‌లుపెట్టిన ఈ యాత్ర‌లో 4 రోజుల పాటు ఆ రాష్ట్రంలో పాద‌యాత్ర సాగించిన రాహుల్‌... ఆ త‌ర్వాత కేర‌ళ‌లో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. 

9వ రోజు పాద‌యాత్ర‌లో భాగంగా రాహుల్ గాంధీ మ‌రింత ఉత్సాహంగా క‌నిపించారు. యాత్ర‌లో బాగంగా వ‌డివ‌డిగా న‌డుస్తున్న రాహుల్ గాంధీ వ‌ద్ద‌కు వ‌చ్చిన ఓ న‌డి వ‌య‌సు మ‌హిళ ఆయ‌న‌కు ఆప్యాయంగా ముద్దు పెట్టింది. ఈ సంద‌ర్భంగా రాహుల్ కూడా ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, ప‌ల‌క‌రించారు. త‌న యాత్ర‌కు భ‌ద్ర‌త క‌ల్పిస్తున్న పోలీసుల్లో ఇద్దరు మ‌హిళా పోలీసు అధికారుల‌తో క‌లిసి న‌డుస్తూ రాహుల్ ఫొటోల‌కు పోజిచ్చారు.