Samantha: 'యువరాణి'లా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సమంత!

  • బాలీవుడ్ పై కన్నేసిన సమంత
  • అమర్ కౌశిక్ దర్శకత్వలో హారర్ కామెడీ
  • హీరోగా ఆయుష్మాన్ ఖురానా
  • వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్న చిత్రం!
Samantha reportedly set to make bollywood entry

డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్ ల ద్వారా హిందీ ప్రేక్షకులకు పరిచయమైన సమంత ఇప్పుడు బాలీవుడ్ పై కన్నేసింది. ఓ స్ట్రెయిట్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా ఓ హారర్ కామెడీ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో సమంత ఓ యువరాణి పాత్ర పోషించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందట. ఇందులో ఆయుష్మాన్ ఖురానా ఓ డ్రాక్యులా తరహా పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఓ రాజస్థానీ జానపద గాథ ఆధారంగా తెరకెక్కించనున్నారని జాతీయ మీడియా పేర్కొంది.

More Telugu News