తిరుమల శ్రీవారికి రూ.1.5 కోట్ల విరాళం అందించిన ముఖేశ్ అంబానీ

16-09-2022 Fri 14:07
  • తిరుమల విచ్చేసిన ముఖేశ్ అంబానీ
  • బ్రేక్ సమయంలో దర్శనం
  • శేష వస్త్రం బహూకరించిన ఆలయ వర్గాలు
  • గోశాలను సందర్శించిన అంబానీ
Mukhesh Ambani donates one and half crore rupees to TTD
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తిరుమల విచ్చేశారు. ఇవాళ బ్రేక్ సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అర్చక పండితులు ఆయనకు శేష వస్త్రం బహూకరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖేశ్ అంబానీ తిరుమల శ్రీవారికి భారీ విరాళం సమర్పించారు. రూ.1.5 కోట్ల విరాళం తాలూకు చెక్కును ఆయన టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందించారు. 

అనంతరం ఆయన స్థానిక గోశాలను కూడా సందర్శించారు. కాగా, తిరుమల పర్యటన సందర్భగా ముఖేశ్ అంబానీ వెంట వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, గురుమూర్తి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.