Narendra Modi: మోదీ పుట్టినరోజున ఢిల్లీ రెస్టారెంట్ బంపర్ ఆఫర్... రూ.8.5 లక్షలు గెలుచుకునే పసందైన అవకాశం

Delhi restaurant announces bumper offer on PM Modi birthday
  • సెప్టెంబరు 17న ప్రధాని మోదీ పుట్టినరోజు
  • 'తాలీ తినండి.. నగదు గెలుచుకోండి' అంటూ రెస్టారెంట్ ఆఫర్
  • 40 నిమిషాల్లో తాలీ తింటే భారీ నగదు బహుమతి
ప్రధాని నరేంద్ర మోదీ  పుట్టినరోజు (సెప్టెంబరు 17) సందర్భంగా ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ రెస్టారెంట్ లో రూపొందించిన ప్రత్యేక తాలీని 40 నిమిషాల్లో లాగించిన వారికి రూ.8.5 లక్షలు ఇస్తామని వెల్లడించింది. ఈ రెస్టారెంట్ పేరు ఆర్డర్ 2.0 కాగా, ఇది కన్నాట్ ప్లేస్ లో ఉంది. 

దీని యజమాని సుమిత్రా కల్రా స్పందిస్తూ... మోదీని తాము ఎంతో గౌరవిస్తామని, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏదైనా భిన్నంగా చేయాలనుకున్నామని, అందుకే తాలీ పోటీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకమైన తాలీకి '56 అంగుళాల మోదీజీ' అని పేరు పెట్టినట్టు వివరించారు. 

ఈ పోటీలో దంపతులు పాల్గొనవచ్చని, వారిలో ఏ ఒక్కరైనా 40 నిమిషాల్లోపు తాలీ మొత్తం తింటే వారికి రూ.8.5 లక్షల రివార్డు అందజేస్తామని వెల్లడించారు. అంతేకాదు, సెప్టెంబరు 17వ తేదీ నుంచి 26వ తేదీ మధ్య తమ రెస్టారెంట్ లో తాలీ భుజించిన వారిలో లక్కీ విన్నర్ కు కేదార్ నాథ్ పర్యటన అవకాశం కల్పిస్తామని సుమిత్ర కల్రా చెప్పారు.
Narendra Modi
Birthday
Restaurant
Thali
Bumper Offer
New Delhi

More Telugu News