Mark Boucher: ముంబయి ఇండియన్స్ ప్రధాన కోచ్ గా దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్

SA former wicket keeper Mark Boucher appointed as Mumbai Indians head coach
  • వచ్చే సీజన్ కు సన్నాహాలు షురూ చేసిన ముంబయి
  • ప్రస్తుత కోచ్ జయవర్ధనేకు గ్లోబల్ హెడ్ గా ప్రమోషన్
  • ముంబయి ఇండియన్స్ కోచ్ గా మార్క్ బౌచర్
  • ముంబయి బ్రాండ్ వాల్యూను మరింత పెంచుతానన్న బౌచర్
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబయి ఇండియన్స్ కు గుర్తింపు ఉంది. కాగా, వచ్చే సీజన్ కోసం ముంబయి ఫ్రాంచైజీ ఇప్పటినుంచే సన్నద్ధత మొదలుపెట్టింది. ఇప్పటిదాకా ప్రధాన కోచ్ గా ఉన్న మహేల జయవర్ధనేను తమ ఫ్రాంచైజీ పెర్ఫార్మెన్స్ గ్లోబల్ హెడ్ గా నియమించింది. మహేల స్థానంలో ముంబయి ఇండియన్స్ ప్రధాన కోచ్ గా దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ ను తీసుకువచ్చింది. ఈ మేరకు ముంబయి ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. 

ఈ నియామకాన్ని రిలయన్స్ జియో అధినేత ఆకాశ్ అంబానీ నిర్ధారించారు. జట్టుకు అద్భుతమైన విలువను జోడిస్తాడంటూ బౌచర్ ను కొనియాడారు. బౌచర్ అనుభవం తమ జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నామని తెలిపారు. 

కాగా, ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీకి ప్రధాన కోచ్ గా నియమితుడవడం పట్ల మార్క్ బౌచర్ స్పందించాడు. ముంబయి జట్టులో మేటి ఆటగాళ్లకు కొదవలేదని, ఆ జట్టు విలువను మరింత పెంచేందుకు కృషి చేస్తానని తెలిపాడు. ముంబయి ఇండియన్స్ వంటి గొప్ప జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరించనుండడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని వెల్లడించాడు.
Mark Boucher
Head Coach
Mumbai Indians
IPL
South Africa

More Telugu News