Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్.. టీడీపీ సభ్యుల తీరు బాధగా ఉందన్న స్పీకర్

TDP MLAs suspended from Assembly
  • పెరిగిన ఛార్జీలు, పన్నులపై చర్చకు పట్టుబడ్డ టీడీపీ
  • వెల్ లోకి దూసుకెళ్లి స్పీకర్ ను చుట్టుముట్టిన వైనం
  • ఒకరోజు పాటు సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. పెరిగిన ఛార్జీలు, పన్నులపై టీడీపీ చర్చకు పట్టుబట్టింది. ఈ సందర్భంగా వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది. ఇరుపక్షాల వారు గట్టిగా కేకలు వేశారు. ఈ సందర్భంగా వెల్ లోకి టీడీపీ ఎమ్మెల్యేలు దూసుకుపోయారు. స్పీకర్ తమ్మినేని సీతారాంను చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ విధించారు. ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 

ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, టీడీపీ సభ్యుల ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని మండిపడ్డారు. ప్రతి రోజు సభ సజావుగా కొనసాగకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. సభలో మీరు మాత్రమే సభ్యులా? ఇతరులు సభ్యులు కాదా? అని ప్రశ్నించారు. సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. టీడీపీ సభ్యుల తీరు చూస్తుంటే చాలా బాధగా ఉందని చెప్పారు. టీడీపీ సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని... దానికి అనుగుణంగా తాను చర్యలు తీసుకుంటానని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గనను స్పీకర్ కోరారు.
Andhra Pradesh
AP Assembly Session
Telugudesam
MLAs
Suspension

More Telugu News